‘గీతా ఆర్ట్స్’ సంస్థకు ఆ పేరెందుకు పెట్టారంటే…
మనసర్కార్ -సినిమా
అల్లు అరవింద్ సొంత బ్యానర్ ‘గీతా ఆర్ట్స్’ గురించి మనందరకూ తెలుసు. చిరంజీవి, అల్లు అర్జున్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్‌లకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించింది ఈ గీతా ఆర్ట్స్. అయితే ఈ పేరు ఎందుకు పెట్టారో చాలా ఆసక్తి కరంగా చెప్పారు అల్లు అరవింద్ ‘అలీతో సరదాగా’ టాక్ షోలో. గీతా ఆర్ట్స్‌లో గీత ఎవరు అన్న అలీ ప్రశ్నకు సమాధానమిచ్చారు అల్లు అరవింద్. ఈ పేరు పెట్టింది తన తండ్రి అల్లు రామలింగయ్య అని చెప్పారు. భగవద్గీత సారాంశం నచ్చి ఆ పేరు పెట్టారని, ప్రయత్నం మాత్రమే మన చేతిలో ఉంటుందని, ఫలితం మన చేతిలో ఉండదని గీతా సారాంశాన్ని గుర్తు చేయడానికి ఆపేరు పెట్టారని పేర్కొన్నారు. ఇది సినిమాలకు బాగా వర్తిస్తుందని, నిర్మాతగా సినిమా తీయడమే తన చేతిలో ఉంటుందని, ఫలితం ప్రేక్షకుల చేతిలో ఉంటుందని గీత పేరు పెట్టారు. వివాహం అనంతరం భార్య నిర్మల గారి పేరు పెట్టొచ్చు కదా అని అలీ ప్రశ్నించారు. గీత పేరుతో తీసిన సినిమాలన్నీ సిల్వర్ జూబ్లీ ఆడాయని, అందుకే మార్చే ఉద్దేశ్యం లేదని అన్నారు. పైగా చదువుకునే రోజుల్లో తనకు గీత అనే గర్ల్‌ఫ్రెండ్ ఉందని, తన స్నేహితులు కూడా అందుకే ఆటపట్టించేవారని జోక్ చేశారు అల్లు అరవింద్.

