Andhra PradeshHome Page Slider

ఏపీకి గౌతమ్ అదానీ భారీ విరాళం..

ఇటీవల భారీ వర్షాలు, వరదలతో ఏపీ అతలాకుతలమైంది. ఈ క్రమంలో వరద బాధితులను ఆదుకునేందుకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సహా వ్యాపారవేత్తలు సైతం ముందుకు వచ్చారు. సీఎం రిలీఫ్ ఫండ్ కి తమ వంతు విరాళం అందించారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సాయం చేసేందుకు అదానీ గ్రూప్ ముందుకొచ్చింది. అదానీ ఫౌండేషన్ రూ. 25 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించింది. ఈ మేరకు అదానీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ గౌతమ్ అదానీ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదుకునేందుకు తమ వంతు సహకారం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు సంబంధిత పత్రాలను సంస్థ ఎండీ కిరణ్ అదానీ సీఎం చంద్రబాబుకు అందిస్తోన్న ఫోటోను షేర్ చేశారు.