Home Page SliderNational

టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ నియామకం

T2o ప్రపంచకప్‌తో టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ పదవికాలం ముగిసింది. దీంతో గౌతమ్ గంభీర్‌ను హెడ్ కోచ్‌గా నియమిస్తున్నట్లు BCCI తాజాగా ప్రకటించింది. ఈ విషయాన్ని BCCI ప్రధాన కార్యదర్శి జైషా తన x అకౌంట్‌లో పోస్ట్ చేశారు. తన క్రికెట్ కెరీర్‌లో గంభీర్ జట్టు కోసం ఎన్నో రకాల పాత్రలు పోషించారన్నారు. అయితే ఆయన క్రికెట్‌ను మరింత ముందుకు తీసుకు వెళ్తారని మాకు నమ్మకం ఉందన్నారు. కాగా గంభీర్ అనుభవం క్రికెట్‌కు ఎంతో ముఖ్యమని జైషా పేర్కొన్నారు.ఈ మేరకు BCCI ఆయనకు అన్ని విధాలుగా సహకరిస్తుందన్నారు. కాగా గంభీర్ సారథ్యంలోనే టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది.అయితే సహాయ కోచ్‌ల విషయంలో కూడా BCCI గంభీర్‌కు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా ఈ రోజు మధ్యహ్నం వరకు జీతభత్యాల విషయంలో BCCIకి గంభీర్‌కు మధ్య చర్చ కొనసాగనుంది.