చైనా రెస్టారెంట్లో గ్యాస్ లీక్ -31 మంది మృతి
చైనాలోని యించువాన్ నగరంలోని ప్యూయాంగ్ బార్బెక్యూ అనే రెస్టారెంట్లో బుధవారం రాత్రి 8 గంటల సమయంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఎల్‌పీజీ గ్యాస్ లీక్ కావడంతో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 31 మంది మృతి చెందారు. పలువురు గాయాలపాలయ్యారు. చైనా ప్రజలకు డ్రాగన్ బోట్ ఫెస్టివల్ అనే పండుగ జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మూడు రోజులు సెలవులు ఇచ్చారు. ప్రజలందరూ బంధుమిత్రులతో సరదాగా గడుపుతున్న సమయంలో ఇలాంటి ప్రమాదం జరగడం చాలా దురదృష్టకరం. ఈ ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే అలెర్టయిన ఫైర్ ఇంజన్లు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశాయి. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించి, చికిత్స అందిస్తున్నారు.