Home Page SliderTelangana

కూకట్ పల్లిలో పేలిన గ్యాస్ సిలిండర్..

హైదరాబాద్ నగరంలోని కూకట్ పల్లిలో గ్యాస్ సిలిండర్ పేలింది. పెద్ద సిలిండర్ల నుంచి చిన్న సిలిండర్లలో అక్రమంగా గ్యాస్ నింపుతుండగా ప్రమాదం సంభవించింది. దీంతో ఒక్కసారిగా భారీ పేలుడు శబ్దంతో జనం పరుగులు తీశారు. గ్యాస్ ఫిల్లింగ్ చేస్తున్న శంకర్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడ్డ శంకర్ ను గాంధీ ఆసుపత్రికి స్థానికులు తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరకొని దర్యాప్తు చేస్తున్నారు.