Andhra PradeshBreaking News

నారా లోకేశ్‌తో గంటా భేటి..ఇక ఆ పార్టీతోనే పయనం…!

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ను టీడీపీ ఎమ్మెల్యే, సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు హైదరాబాద్‌లో ఇవాళ సమావేశం అయ్యారు. గత ఎన్నికల తర్వాత గంటా శ్రీనివాసరావుకు, టీడీపీకి మధ్య దూరం పెరిగిందని ప్రచారం జరుగుతోంది. పార్టీ కార్యక్రమాల్లో గంటా పెద్దగా పాల్గొన్నది లేదు..ఆయనపై పార్టీ అధిష్టానం అసంతృప్తిగా ఉందన్న ప్రచారం నేపథ్యంలో లోకేశ్ తో గంటా భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇవాళ జూబ్లీహిల్స్ లోని నారా లోకేశ్ నివాసానికి వచ్చిన గంటా శ్రీనివాస రావు దాదాపు 40 నిమిషాల సేపు చర్చించారు. పార్టీ పట్ల తన వైఖరిని ఆయన లోకేశ్ కు వివరించినట్టు తెలుస్తోంది. ఇటీవలి రాజకీయ పరిణామాలపైనా ఇరువురు మాట్లాడుకున్నట్టు సమాచారం. ఉమ్మడి విశాఖలో దాదాపు చాలా నియోజకవర్గాలకు తెలుగుదేశం ఇంఛార్జ్‌లను ఖరారు చేస్తోంది.. ఈ తరుణంలోనే ఈ సమావేశం జరిగినట్టు ప్రచారం సాగుతోంది.