Home Page SliderTelangana

హైదరాబాద్‌లో గంజాయి చాక్లెట్స్ కలకలం

హైదరాబాద్‌లో డ్రగ్స్,గంజాయి కలకలం సృష్టిస్తున్నాయి. తెలంగాణా పోలీసులు ఎన్ని రకాల చర్యలు చేపట్టినా వీటిని అరికట్టలేకపోతున్నారు.దీంతో హైదరాబాద్‌లో నిత్యం డ్రగ్స్ కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి. అయితే ఇవాళ హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్టలో గంజాయి చాక్లెట్స్‌ను పోలీసులు పట్టుకున్నారు.కాగా కిరాణా షాప్ ముసుగులో గంజాయి చాక్లెట్స్ విక్రయించడం పోలీసులు గుర్తించారు.ఈ మేరకు గంజాయి చాక్లెట్స్ అమ్ముతున్న సునీతను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమె నుంచి 9.5 కేజీల గంజాయి చాక్లెట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.