బోర్డర్-గావస్కర్ టెస్ట్‌పై గంగూలీ కీలక వ్యాఖ్యలు
మాజీ టీమిండియా కెప్టెన్, బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ భారత్-ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా బోర్డర్ -గావస్కర్ మ్యాచ్‌లో టీమిండియా పెర్ఫామెన్స్‌ను మెచ్చుకున్నారు. అలాగే ఆస్ట్రేలియాకు వార్నింగ్ కూడా ఇచ్చారు. పెర్త్ టెస్టులో మన కుర్రాళ్లు మంచి ప్రదర్శన చేశారన్నారు. బుమ్రా, కోహ్లి, యశస్వీ అద్భుతాలు సాధించారని, నితీశ్ రెడ్డి సూపర్ అని తనకు నచ్చాడని వ్యాఖ్యానించారు. మిగిలిన నాలుగు టెస్ట్‌లలో కూడా కంగారూలకు కంగారు పుట్టించాలని పేర్కొన్నారు. ఆస్ట్రేలియా సరిగా ఆడకుంటే ఈ సిరీస్ ఎప్పటికి ముగుస్తుందోనని బాధపడాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు.