గంగూలీ కారుకు ప్రమాదం
ఇండియన్ క్రికెట్ టీం మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి పెను ప్రమాదం తప్పింది. పశ్చిమబెంగాల్ లోని దంతన్పూర్ వద్ద ఓ లారీ ఆయన కాన్వాయ్ ను ఓవర్టేక్ చేయడంతో డ్రైవర్ సడెన్ గా బ్రేకులు వేయాల్సి వచ్చింది. దీంతో గంగూలీ వాహనానికి వెనక ఉన్న కార్లన్నీ ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో రెండు కార్లు దెబ్బతినగా, గంగూలీ సహా ఎవరికీ గాయాలు కాలేదు. ఓ ఈవెంట్ కోసం బుర్ద్వాన్ వర్సిటీకి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

