home page sliderHome Page SliderNational

గంగూలీ సోదరుడికి తృటిలో తప్పిన ప్రమాదం

బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సోదరుడికి తృటిలో ప్రమాదం తప్పింది. పూరీ బీచ్ లో అతను ప్రయాణిస్తున్న స్పీడ్ బోటు బోల్తాపడి మునిగిపోయింది. అదే బోటులో గంగూలీ సోదరుడు స్నేహశీష్ గంగూలీ, అతని భార్య అర్పిత ప్రయాణించారు. విషయం తెలుసుకున్న లైఫ్ గార్డులు తక్షణమే స్పందించి వారిని రక్షించారు. ప్రాణాపాయం నుండి బయటపడిన స్నేహశిష్ దంపతులు ప్రస్తుతం కోల్ కతాకు చేరుకున్నారు. మాకిది పునర్జన్మ అని గంగూలీ భార్య అర్పిత అన్నారు. అదో భయానక ఘటన అని ఆమె గుర్తు చేసుకున్నారు. పూరి జగన్నాథుని దయ వల్ల ప్రాణాపాయం నుంచి బయటపడ్డామని తెలిపారు.