Home Page SliderTelangana

గంగుల కమలాకర్ ఇంట తీవ్ర విషాదం

గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తల్లి గంగుల నర్సమ్మ కరీంనగర్ లోని స్వగృహంలో ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. నర్సమ్మ మృతిపట్ల మాజీ సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు గంగుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.