యూపీలో మళ్లీ గ్యాంగ్ వార్ -కాల్పుల కలకలం
యూపీ రాజధాని లక్నోలో మళ్లీ గ్యాంగ్ స్టర్స్ రెచ్చిపోయారు. ఈరోజు (బుధవారం) సిటీ సివిల్ కోర్టులో విచారణ జరుగుతుండగానే జడ్జి ఎదుటే కాల్పులకు తెగబడ్డారు. ఓ గ్యాంగ్ స్టర్‌పై విచ్చలవిడిగా కాల్పులు జరిపారు. వారు లాయర్ల దుస్తుల్లో వచ్చినట్లు సమాచారం. ఈ కాల్పుల్లో సంజీవ్ జీవా అనే గ్యాంగ్ స్టర్ మరణించారు. పలువురు పోలీస్ సిబ్బందికి గాయలయ్యాయి. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ఐదు రౌండ్ల కాల్పులు జరిపారు. వెంటనే అలెర్టయిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన వారికి చికిత్సను అందిస్తున్నారు. గతంలో కూడా గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్ పోలీస్ కస్టడీలోనే హత్యకు గురయ్యాడు. ఇలా వరుసగా గ్యాంగ్‌స్టర్స్ ఎన్‌కౌంటర్స్, హత్యలు, కాల్పులు జరగడం వివాదాస్పదంగా మారింది. హత్యకు గురైన సంజీవ్ జీవాపై అనేక క్రిమినల్ కేసులు ఉన్నట్లు సమాచారం. ఈ కాల్పుల వెనుక ముక్తార్ అన్సారీ అనుచరులు ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ ముక్తర్ అన్సారీ ఈ సంజీవ్ జీవాకు సన్నిహితుడే, పైగా బీజేపీ ఎమ్మెల్యే బ్రహ్మదత్ ద్వివేది హత్యకేసులో వీరిద్దరూ నిందితులుగా ఉన్నారు.

