Breaking Newshome page sliderHome Page SliderNewsNews AlertTelanganaviral

ప్రేమ, స్నేహం పేరుతో సామూహిక అత్యాచారం

జనగామ లో దారుణం 10 కలిసి గ్యాంగ్ రేప్పో లిసుల విచారణలో విస్తుపోయే నిజాలు ప్రేమ, స్నేహం పేరుతో యువతి (18)ని నమ్మించి పలువురు యువకులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. జనగామ జిల్లా కేంద్రానికి చెందిన ఓ యువతికి అదే పట్టణానికి చెందిన మహమ్మద్‌ ఒవైసీ అనే యువకుడు ప్రేమ పేరుతో దగ్గరై శారీరకంగా వాడుకున్నాడు. ఈ క్రమంలో ఒవైసీ సహకారంతో అతడి 9 మంది స్నేహితులు యువతికి స్నేహం పేరుతో దగ్గరయ్యారు . ఈ ఏడాది జూన్‌లో మాట్లాడుకుందామని యువతిని ఒవైసీ అతని స్నేహితులు బయటకు పిలిపించారు.అనంతరం ఆమెను కారులో ఎక్కించుకొని జనగామలోనే ఓ గదికి తీసుకెళ్లి ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి ఒడిగట్టారు. భయపడిన యువతి విషయం బయటకు చెప్పలేదు. అనంతరం వారిలో ఓ యువకుడు యువతిని ప్రేమిస్తున్నానని నమ్మించి గోవా తీసుకెళ్లి అక్క డ కూడా ఆమెను శారీరకంగా వాడుకున్నాడు. జనగామకు తిరిగొచ్చాక బాధితురాలు తన చిన్నమ్మ సాయంతో ఇటీవల పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు విచారించి బాధితురాలిపై 10 మంది యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు నిర్ధారించారు. బుధవారం జనగామలో వారందరినీ అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. నిందితుల నుంచి 3 సెల్‌ఫోన్లు, కారును స్వాధీనం చేసుకున్నారు. యువతికి తల్లిదండ్రులు లేకపోవడంతో చిరు వ్యాపారం చేసే చిన్నమ్మ సంరక్షణలో ఉంటోంది. కాగా, ప్రధాన నిందితుడు ఒవైసీ జనగామలో కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నట్టు తెలిసింది. నిందితులందరూ అవివాహితులే.