Home Page SliderTelangana

నకిలీ పత్తి విత్తనాల ముఠా అరెస్ట్

నకిలీ పత్తి విత్తనాలను తక్కువధరకే నాణ్యమైన విత్తనాలంటూ అమ్ముతున్న 15 మంది నకిలీ విత్తనాల ముఠాను అరెస్టు చేశారు వరంగల్  పోలీసులు. 2 ముఠాలకు చెందిన 15 మందిని అరెస్టు చేయగా మరో ముగ్గురు పరారయినట్లు తెలియజేశారు.  కర్నాటక, హైదరాబాద్‌లలో ఈ విత్తనాలను తయారు చేసి, వాటిని ప్యాకింగ్ చేసి మహారాష్ట్ర, తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలకు అమ్ముతున్నారు ఈ ముఠా.జనగామ నుండి మార్కెట్లలోకి ఈ నకిలీ విత్తనాలు పోటెత్తుతున్నాయి. నగర కమిషనర్ సిపి రంగనాథ్ మాట్లాడుతూ తక్కువ రేటుకు వచ్చే విత్తనాల విషయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వ దుకాణాలలోనే విత్తనాలను కొనుగోలు చేయాలని రైతులను సూచించారు. వ్యవసాయ శాఖ సహకారంతో తాము కూడా రైతులకు అవగాహన కల్పిస్తామని తెలియజేస్తున్నారు. హైదరాబాద్‌లో కూడా ఇలాంటి ముఠాను అరెస్టు చేశారు సైబరాబాద్ పోలీసులు. ఈ దాడిలో 95 లక్షల రూపాయలు విలువ చేసే 3.38 టన్నుల ఫేక్ సీడ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. విత్తనాల షాపుల వారికి ఎప్పటి కప్పుడు తనిఖీలు, టాస్క్‌ఫోర్స్ వారి తనిఖీలతో సీజన్ మొదలయిన వెంటనే సాంపిల్స్ సేకరించి, నకిలీ విత్తనాలపై చర్యలు తీసుకుంటున్నామన్నారు.