గేమ్‌చేంజర్ రెండో సాంగ్ మచ్చామచ్చా.. 28నప్రోమో..
రామ్‌చరణ్ రాబోయే సినిమా ‘గేమ్ చేంజర్’ క్రిస్మస్ సందర్భంగా విడుదల చేస్తారు. శంకర్ దర్శకత్వంలో దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలే ఉన్నాయి. సినిమా విడుదలకు ఇంకా మూడు నెలల సమయం ఉన్నా.. పాన్ ఇండియా ఫిల్మ్ కాబట్టి ఇప్పటి నుంచే ప్రచారపర్వాన్ని వేగవంతం చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని తెలిసింది. ఇప్పటికే విడుదలైన తొలి గీతం ‘జరగండి జరగండి’ మంచి ఆదరణ, హిట్ సాంగ్ అనే పేరును దక్కించుకుంది. ‘రా మచ్చా మచ్చా..’ అంటూ సాగే రెండో పాట ప్రోమోను ఈ నెల 28న విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం
తెలిపింది. బుధవారం కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. తమన్ స్వరపరచి చేసిన ఈ గీతాన్ని అనంత్ శ్రీరామ్ రచించారు. హుషారైన బీట్‌తో సాగే మాస్ పాట ఇదని చిత్ర బృందం పేర్కొంది. రాజకీయ, సామాజికాంశాలపై చర్చిస్తూ తనదైన శైలి సందేశంతో దర్శకుడు శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కియారా అద్వాణీ, అంజలి, సముద్రఖని, ఎస్.జె.సూర్య, శ్రీకాంత్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్, దర్శకత్వం: శంకర్.

