Home Page SliderNational

బీజేపీ గూటికి గాలి జనార్దన రెడ్డి.. పార్టీ విలీనం

బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, పార్టీ వ్యవస్థాపకుడు గాలి జనార్దన రెడ్డి బీజేపీలో చేరారు. తన పార్టీని కూడా విలీనం చేశారు. బెంగళూరులో సోమవారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర సీనియర్ నేత బీఎస్ యడియూరప్ప సమక్షంలో జనార్దనరెడ్డి, ఆయన సతీమణి లక్ష్మి కాషాయ కండువా ధరించారు. తన పార్టీని కూడా బీజేపీలో కలిపేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోడీని మూడోసారి అధికారంలో నిలబెట్టేందుకు బీజేపీ కార్యకర్తగా పనిచేస్తా, ఎలాంటి షరతులు లేకుండా నేను పార్టీలో చేరా. బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగిన తన స్నేహితుడు బి.శ్రీరాములుకు మద్దతుగా ఆయన ప్రచారం చేయనున్నట్లు తెలుస్తోంది. బీజేపీలో ఆయన చేరికతో బళ్లారి, కొప్పళ జిల్లాల్లో పార్టీకి మరింత బలం చేకూరుతుందని కమలనాథులు భావిస్తున్నారు.