గజ్వేల్: వర్గల్-తున్కి ఖల్సా ఎన్నికల ప్రచారంలో ఈటల
గజ్వేల్ నియోజకవర్గం వర్గల్ మండలం తున్కి ఖల్సా గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఈటల రాజేందర్.
కేసీఆర్‌కి మానవత్వం లేదు. అహంకారం ఎక్కువ అయ్యింది. ఇళ్లకోసం ధర్నా చేస్తే జైల్లో పెట్టిన నీచమైన చరిత్రమీది. హరేష్ రావు రా ఈ ఊరికి నా ఆడబిడ్డలు సమాధానం చెప్తారు. నీ మంత్రి పదవి మీ అమ్మ ఇవ్వలేదు బిడ్డా. ప్రజాస్వామ్యంలో ప్రజలు శాశ్వతం, నాయకులు కాదు. కేసీఆర్ గజ్వేల్‌లో నీ భరతం పట్టుడు ఖాయం. నీకు తెలిసింది తాగిపిచ్చుడు. అటుకులు బుక్కి నడిపిన పార్టీకి ఓటుకు 10 వేలు ఇచ్చే స్థాయి ఎలా వచ్చింది, సమాధానం చెప్పగలవా కేసీఆర్.
మోదీ గారికి కుటుంబం లేదు. దేశ ప్రజలే కుటుంబం. బీసీ బిడ్డను సీఎం చేస్తా అని ప్రకటించారు. టీడీపీలో అయితే ఎన్టీఆర్ లేదా చంద్రబాబు, BRSలో అయితే కేసీఆర్ లేదా కేటీఆర్ లేదా హరీష్ రావు సీఎంలు అవుతారు. కానీ ఆకలి ఉన్న వారికి అధికారం అందించే పార్టీ బీజేపీ.

