Home Page SliderTelangana

గజ్వేల్: వర్గల్-నర్సంపల్లి ప్రచారంలో-ఈటల రాజేందర్

గజ్వేల్ నియోజకవర్గం వర్గల్ మండలం నర్సంపల్లి ఎన్నికల ప్రచారంలో ఈటల రాజేందర్. సంపాదించిన ప్రతిపైసా తాగుడికి పోతోంది. ఆడబిడ్డలారా ఆలోచన చేయండి. తండ్రులు తాగుతున్నారు.. కొడుకులు తాగుతున్నారు. మీకిచ్చే కల్యాణ లక్షీ, పెన్షన్ మిగతావి అన్నీ కలిపి రూ.25,000 ఇస్తే తాగుడుతో కేసీఆర్ గుంజుకొనేది 45 వేల కోట్లు. 10 ఏళ్లుగా నర్సంపల్లికి కేసీఆర్ ఏం వెలగబెట్టారు. ఏం బాగు చేశారు. భూములు కాపాడుకోవాలంటే, రేషన్ కార్డు రావాలంటే కేసీఆర్‌ను ఓడగొట్టాలి. 45 ఏళ్లు కాంగ్రెస్, 16 ఏళ్లు టీడీపీ, 10 ఏళ్లు BRSలు పాలించాయి. అందరినీ చూశాం. మోదీ గారు అండతో ఇక్కడ బీజేపీ పాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఒక్కసారి అవకాశం ఇవ్వండి ప్రజాపాలన అందిస్తాం.

నర్సంపల్లికి నిన్న ఒక్కో బూత్‌కి 6 పెట్టెల మందు వచ్చింది. రూ.50 వేలు డబ్బులు వచ్చాయి. మందు పుక్కట్‌కి వచ్చింది అని ఎక్కువ తాగకండి ఆరోగ్యం కరాబ్ అవుతుంది. డబ్బులు ఎన్ని ఇచ్చినా తీసుకోండి. ఓటు మాత్రం ధర్మానికి ఓటు వేయండి. సత్యనారాయణ అనే రైతుకి 3 ఎకరాల భూమి పోతుంది అంట. మందు డబ్బా పట్టుకోవడమే దిక్కు అంటున్నారు. మనం చేయాల్సింది అది కాదు. ఓటుతో దెబ్బకొట్టాలి. చాలామంది భూములు పోయాయని తాగుడికి బానిసలయ్యారు. పిచ్చివాళ్లు అయిపోతున్నారు. బంగారు తెలంగాణ కాదు ముంచే తెలంగాణ చేస్తున్నాడు.