గజ్వేల్: కుకునూరుపల్లి ఎన్నికల ప్రచారంలో ఈటల రాజేందర్
గజ్వేల్ నియోజవర్గం కుకునూరుపల్లి మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఈటల రాజేందర్.
కెసిఆర్ ఇచ్చినవి ఎన్నిహామీలు? ఎన్ని అమలు అయ్యాయి? కెసిఆర్ ఫాం హౌస్ కట్టుకోవడానికి తీరిక ఉంది కానీ రేషన్ కార్డులు ఇవ్వడానికి టైం లేదు. మేము వస్తే 3 నెలల లోపు రేషన్ కార్డులు ఇస్తాం.
నౌకరీలు ఇయ్యలేదు సరి కదా.. పెట్టిన పరీక్షా పత్రాలన్నీ లీక్ అయ్యాయి. కొనుక్కున్న వారికే ఉద్యోగాలు వస్తాయని నిరూపించిన వ్యక్తి కెసిఆర్. నౌకరీలు రాక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీనికి కారకుడు కేసీఆర్ ఆయన్ని మళ్లీ ఎన్నుకుందామా ఆలోచన చేయండి?
హుజూరాబాదులో నన్ను ఓడించడానికి దళిత బందు తీసుకొచ్చాడు. మనసుంటే మార్గం ఉంటుంది అందరికీ ఇస్తా అన్నారు. మరి సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో ఎంతమందికి దళిత బంధు ఇచ్చాడు సమాధానం చెప్పాలి. బీసీ బందు ఎంతమందికి ఇచ్చాడో తేల్చాలి. బిజెపి అధికారంలోకి వస్తే మహిళా సంఘాలకు బకాయి పడ్డ రూ.4,200 కోట్లు విడుదల చేస్తాము. ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ లేని రుణాల ఇస్తాము. మహిళలకు ఇన్సూరెన్స్ మేమే కడతాము. రైతు రుణమాఫీ చేయలేదు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, డబుల్ బెడ్ రూమ్ ఇవ్వలేదు, పెన్షన్లు కూడా 57 సంవత్సరాల వారికీ ఇవ్వలేదు.. రెండేళ్లుగా భర్తలు చనిపోయిన వారికి పెన్షన్ ఇవ్వడం లేదు.. కేసీఆర్ తాళం వేసుకున్నారు. బిజెపి వస్తే పెన్షన్లు పోతాయి అంటున్నారు. పోవు సరికదా ఇద్దరి ముసలి వాళ్లకు పెన్షన్ ఇస్తాము. భర్తలు చనిపోయిన వారికి ఆరు నెలల లోపు పెన్షన్ అందిస్తాము. కిలో తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేసే జిమ్మీదార్ మాది. పిల్లల చదువుల కోసం అప్పులు చేస్తున్నారు..
నరేంద్ర మోడీ గారు హామీ ఇవ్వమన్నారు పేద పిల్లలకు నాణ్యమైన ఇంగ్లీష్ ఉచితంగా అందిస్తామని చెప్పారు. క్యాన్సర్ వచ్చినా, యాక్సిడెంట్ అయినా, పెద్ద రోగం వచ్చిన రూపాయి ఖర్చు లేకుండా ఉచిత వైద్యం అందించే జిమ్మేదార్ మాది. ఈరోజు నా మీద హరీష్ మాట్లాడుతున్నాడు. నీలాగానే నేను కూడా ఉన్నాను.. నీలాగానే నేను కూడా ఆర్థిక మంత్రిగా పని చేశాను. హరీష్ రావు గుండె మీద చెయ్యి వేసుకుని చెప్పు నీకు సొంతంగా నిర్ణయం తీసుకునే దమ్ము ఉందా? రాజుగారు చెప్పింది చేయాలి తప్ప ఏ మంత్రికి అధికారం లేదు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే రాచరికం ఉండదు. ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే కేసీఆర్. ఒక్కనాడు అన్న ప్రజలను కలిసారా? పలకరించాడా? ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకు కదా. ఎందుకు రాలేదు. మన ముఖం చూడని, మనల్ని గౌరవించని.. ఈ ముఖ్యమంత్రికి మళ్ళీ ఓటువేసి గెలిపించుకొని భూములు కోల్పోదామా? మన బిడ్డలకు ఉద్యోగాలు రాకుండా చేసుకుందామా అనే ఆలోచన చేయాలని కోరుతున్నాను. కుకురోడు పల్లె ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరుతున్నాను.
భారత్ మాతాకీ జై! భారత్ మాతాకీ జై!!