గజ్వేల్: కుకునూరుపల్లి-వెంకటాపుర్ ప్రచారంలో ఈటల రాజేందర్
గజ్వేల్ నియోజకవర్గం కుకునూరుపల్లి మండలం వెంకటాపుర్ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఈటల రాజేందర్, గోవా ఎమ్మెల్యే దయానంద్, మండల అధ్యక్షుడు శశిధర్ రెడ్డి.
2014, 2018 కెసిఆర్‌కి రెండుసార్లు ఓటు వేశారు. మొదటిసారి తెలంగాణ తెచ్చినం అని ఓట్లు వేయించుకున్నారు. రెండోసారి కొత్తకాపురం నీళ్ల కోసం ఖర్చు పెడుతున్నాను.. ఈసారి గెలిపించండి ఇచ్చిన హామీలు అన్నీ నెరవేరుస్త అని చెప్పారు.
కెసిఆర్ మాటలు వింటే ఈయన ఎప్పుడో పుట్టి ఉంటే ఎప్పుడో ముఖ్యమంత్రి అయివుంటే ఇన్ని బాధలు ఉండేవి కావు కదా అన్నట్టు ఉంటుంది. కానీ చేతలు మాత్రం ఉండవు. డబుల్ బెడ్ రూమ్ ఇస్తానన్న కెసిఆర్ ఇవ్వలేదు. రూ.ఐదు లక్షలు ఇస్తానని ఇప్పుడు రూ.మూడు లక్షల మాత్రమే ఇస్తానని మోసం చేస్తున్నారు.
నరేంద్ర మోడీ గారు దేశమంతా పేదవారి సొంత ఇంటికల నిజం చేస్తుంటే.. మోడీ గీడి అంటు మాట్లాడి ఇల్లు కట్టించకుండా మోసం చేస్తున్నారు. తెల్ల రేషన్‌కార్డు ఇవ్వడానికి డబ్బులు ఏమి ఖర్చు కావు కదా.. కొత్తగా పెళ్లయి వేరే కాపురం పెట్టిన కుటుంబాలకు రేషన్ కార్డు ఇవ్వాలి కదా. ఆ రేషన్ కార్డు కూడా పేదలకు ఎందుకు ఇవ్వలేదు అని మనం అడగాలా వద్దా? అన్నిట్లో నెంబర్ వన్, నెంబర్ వన్ అని చెప్పే కేసీఆర్.. మాలాంటి వాళ్ళం ఎప్పుడన్నా లేచి అసెంబ్లీలో అడిగితే నీకేం తెలుసు రాజేందర్ కళ్ళు కనిపించడం లేదా పరీక్ష చేయించాలా? అని అడుగుతారు. మరి వెంకటాపూర్ గ్రామంలో ఇల్లు ఇవ్వలేదు అని చెప్తున్నారు కదా మరి మీకు కూడా కనిపించడం లేదా? మీ పిల్లలకి ఉద్యోగాలు వచ్చాయా? తెలంగాణ ఉద్యమం జరిగిందే ఉద్యోగాల కోసం ఎంతమంది పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు.. తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యోగాలు వచ్చాయా? మహిళలకు వడ్డీ పైసలు కూడా ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వాటా ఇస్తోంది. కానీ రాష్ట్రం మాత్రం ఇవ్వడం లేదు. పల్లెటూళ్లలో ప్రకృతి వనం పేరుతో చెట్లు నాటే కార్యక్రమానికి పైసలు కూడా కేంద్రమే ఇస్తోంది. మీ ఊళ్లో వేసిన సిమెంట్ రోడ్లు, మోరీలు, గ్రామ పంచాయతీ భవనాలు, చెట్లు పైసలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేవి అని మీకు తెలుసా. చివరికి మనకు వచ్చే బియ్యం కూడా నరేంద్ర మోడీ గారు ఐదు కిలోల చొప్పున రూపాయి ఖర్చు లేకుండా పంపిస్తున్నారు. ఇంకో 5 ఏళ్ళు కూడా పంపిస్తా అని చెప్పారు.
కలెక్టర్ భవనం కట్టడానికి 20 ఎకరాలు సరిపోతుంది. కానీ పక్కనే ఉన్న 350 ఎకరాలు గుంజుకున్నారు. పేదలకు ఇంత ఖరీదైన భూమి ఎందుకని లాక్కొని రియల్ ఎస్టేట్ వారికి అమ్ముకున్నారు. మళ్లీ కేసీఆర్ గారు గెలిస్తే ఇప్పటివరకు భూములు పోయాయి.. ఇక ఊర్లు కూడా పోతాయని భయపడుతున్నారు. ఇన్ని చేశాక తనకు ఓట్లు వేయరని.. మందు సీసాలు, డబ్బులు పంపిస్తున్నారు. అన్నీ తీసుకోండి ఓటు మాత్రం ధర్మానికి వేయండి. నాకు వేయండి.
కమలం పువ్వు గుర్తుకి ఓటు వేయండి అని చెప్పడానికి వచ్చాను. కెసిఆర్ పీడ 30వ తారీఖుతో పోతుంది.