Home Page SliderTelangana

గజ్వేల్: కుకునూరుపల్లి-చిన్న కిష్టపూర్ ప్రచారంలో ఈటల రాజేందర్

కెసిఆర్, హరీష్ రావును కూడా పార్టీలో ఉండనిచ్చే వాడు కాదు. అల్లుడు కాబట్టి బచాయించిండు.. బయటివాణ్ణి కాబట్టి నన్ను నెట్టేసిండు.

బీజేపీతో పోలిస్తే నీ పార్టీ ఎంత.. నీ లెక్క ఎంత. కోట్ల మంది సభ్యత్వం గల పార్టీ. ఈయన కథ ఎంత.

కెసిఆర్ మాటల్లో చెప్పాలంటే బుడ్డింత—ఈటల రాజేందర్.

గజ్వేల్ నియోజకవర్గం కుకునూరుపల్లి మండలం చిన్న కిష్టపూర్ ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఈటల రాజేందర్, గోవా ఎమ్మెల్యే దయానంద్, మండల అధ్యక్షుడు శశిధర్ రెడ్డి.

మాటలకు చేతలకు పొంతనలేని వ్యక్తి కెసిఆర్. దళిత బంధు, బీసీబంధు, డబుల్ బెడ్రూంలు, మూడు ఎకరాల భూమి, నౌకర్లు, విద్య, వైద్యం ఏది ఇవ్వలేదు. పంట పొలాలకు కూడా పూర్తిగా నీళ్లు రాలేదు. కాళేశ్వరం నీళ్లు వస్తాయి అనుకుంటే అది కూడా కుంగిపోయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మొన్న నన్ను పక్కకు పిలుచుకుని ఒకమాట చెప్పారు. బీసీ ముఖ్యమంత్రిని చేస్తానని హామీ ఇచ్చారు. పేదలకు కావాల్సినవి అన్నీ చేస్తామని హామీ ఇవ్వమని చెప్పారు.

BRS వాళ్ళ తాత జాగీరు కాదు. నిజాం సర్కార్ కాదు. రాచరికం అంతకంటే కాదు. ఎంతోమంది సీఎంలు మారారు. అందులో కెసిఆర్ ఒకరు. గజ్వేల్ మన జాగీరు. మన ఓట్లకు పుట్టింది ఎమ్మెల్యే పదవి.

గజ్వేల్ ప్రజలు ఆత్మను ఆవిష్కరించి ఓటు వేస్తే ఆయన ఎమ్మెల్యే అయ్యారు.. సీఎం అయ్యారు.

బీజేపీతో పోలిస్తే నీ పార్టీ ఎంత.. నీ లెక్క ఎంత. కోట్ల మంది సభ్యత్వం గల పార్టీ. ఈయన కథ ఎంత.

కెసిఆర్ మాటల్లో చెప్పాలంటే బుడ్డింత. మాకు అబద్ధాలు ఆడే నైపుణ్యం లేదు. కెసిఆర్ తిమ్మిని బమ్మిని చేస్తాడు. 10 ఏళ్ల నుండి ఇళ్ళు కట్టడం చేతగాని కెసిఆర్ ఇప్పుడు మూడు లక్షల రూపాయల ప్రొసీడింగ్స్ ఇస్తున్నారట. మూడోతారేఖు అయితే చెల్లని కాగితాలు ఏం చేసుకుందాం. హరీష్‌ను కూడా పార్టీలో ఉండనిచ్చే వాడు కాదు. అల్లుడు కాబట్టి బచాయించిండు.. బయటివాణ్ణి కాబట్టి నన్ను నెట్టేసిండు. మేము దొరల కుటుంబం నుండి వచ్చిన వాళ్ళం కాదు. ఆకలి దుఃఖం తెలిసిన వాళ్ళం. వారు మాటలు మాత్రమే చెప్తున్నారు. మేము చేతల్లో చేసి చూపిస్తాం.