గజ్వేల్ – ఈటల రాజేందర్ (బిజెపి) అభ్యర్థి
గజ్వేల్ – ఈటల రాజేందర్ (బిజెపి) వర్సెస్ కె. చంద్రశేఖర్ రావు (కెసిఆర్) (బిఆర్ఎస్) వర్సెస్ తూంకుంట నర్సా రెడ్డి (కాంగ్రెస్) ముగ్గురు అభ్యర్థులు రంగంలో ఉన్నారు. గజ్వేల్‌కు నేను కొత్తకాదు అన్న ఈటల రాజేందర్. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పొలిటికల్ లీడర్ల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పార్టీలనే కాకుండా ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటూ తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇక హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. గజ్వేల్‌లో ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధం లాంటివని అన్నారు. కానీ గజ్వేల్‌లో బీజేపీ సమావేశాలకు ప్రజలను రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించిన ఈటల.