గజ్వేల్: కుకునూరుపల్లి-లకుడారంలో ఎన్నికల ప్రచారంలో ఈటల
గజ్వేల్ నియోజకవర్గం కుకునూరుపల్లి మండలం లకుడారంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఈటల రాజేందర్.
పెద్దమ్మతల్లి దేవాలయంలో పూజలు చేసి ప్రచారం మొదలుపెట్టారు.
• హరీష్ రావ్ నేను వచ్చానని ఉలిక్కిపడుతున్నారు.
• నేను కోపంగా లేను హరీష్.. గజ్వేల్ ప్రజలు కోపంగా ఉన్నారు.
• ఈ ఊర్లో కాలువలకు భూములు తీసుకున్నారు డబ్బులు ఇచ్చారా?
ఈ పంచాయితీ పార్టీలది కాదు ప్రజలది. ఓటు వేసినం కెసిఆర్ మా ఎమ్మెల్యే అని మర్చిపోకు అని ఇక్కడి ప్రజలు అంటున్నారు. సీఎం అయినందుకు అన్నీ సమస్యలు పరిష్కారం కావాలి కదా హరీష్. డబుల్ బెడ్ రూం ఇచ్చారా? చస్తే రోడ్డు మీద పెట్టుకొని ఏడవడం లేదా? డబుల్ బెడ్ రూం ఇస్తా అని పదేళ్లు అయినా ఎందుకు ఇవ్వలేదు సమాధానం చెప్పే దమ్ము నీకు ఉందా? ఇల్లు కట్టుకోవడనికి రూ.5 లక్షలు ఇస్తా అని ఇప్పుడు రూ.3 లక్షలు ఇస్తానని కాగితం ఇస్తే ప్రజలు నమ్ముతారా? మీకు నిజాయితీ చిత్త శుద్ది ఉందా?
నువ్వు గొప్పొడివి అయితే మిగతా పార్టీల వారు ఓట్లు వెయ్యరు. అసలు నేను ఎందుకు వస్త. పదేళ్లలో వీరివద్దకు వచ్చావా? మేము గొంతెమ్మ కోరికలు అడగడంలేదు. దద్దమ్మ సీఎం అని లకుదరం ప్రజలు అంటున్నారు. హరీష్ నన్ను విమర్శిస్తున్నావు.. నీకు సొంతంగా పనిచేసే కెపాసిటీ ఉందా? సొంత నిర్ణయం నీకు ఉందా?
ఈశ్వరుని ఆజ్ఞ లేనిదే చీమ అయినా కుట్టదు అంటారు.. కెసిఆర్ చెప్పనిదే నువ్వు ఏమన్నా చేయగలవా? జుట్టుకు రూ.1.20 లక్ష అప్పు వాస్తవం కాదా? ఆర్థిక మంత్రిగా ఏమన్నా నిర్ణయం తీసుకొనే శక్తి నీ చేతుల్లో ఉందా? ఎవరికీ కెసిఆర్‌ను ప్రశ్నించే దమ్ములేదు. బానిసలై పడి ఉండాల్సిందే. సొంతంగా పనిచేసేది లేదు. మాది తెలంగాణ ఆత్మగౌరవ పంచాయితీ అణగారిన వర్గాల గుర్తింపు పంచాయితీ. BRS అధికారంలోకి వస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీని సీఎం చేసే దమ్ము ఉందా? ప్రకటించే దమ్ము ఉందా? కాంగ్రెస్‌లో ఎవరు సీఎం అవుతారో అందరికీ తెలుసు. అణగారినవర్గాల పార్టీ అని చెప్పుకుంటారు. ఎప్పుడన్నా వారిని ముఖ్యమంత్రిగా చేశారా? కానీ మోదీ గారు పేదరికాన్ని అనుభవించిన బిడ్డ కాబట్టి బీసీని సీఎం చేస్తా అని ప్రకటించారు. మన ఓట్లు మనకు వేసుకోవాలి. వాళ్లకి ఓట్లు వేసి పనులు చేయమంటే చెయ్యరు.
నిన్న సీఎం మాట్లాడుతూ గాడిదలకు గడ్డివేసి ఆవులకు పాలు పిండితే వస్తాయా? అని అడుగుతున్నారు. నేను అదే అడుగుతున్న.. కెసిఆర్‌కి ఓటు వేసి ఇల్లు, రేషన్ కార్డు ఇవ్వమంటే ఇస్తారా? మన బాధలు ఆయనకు ఏం తెలుసు. కెసిఆర్ 150 ఎకరాలను డబుల్ చేసుకున్నారు. ఉన్న భూములు లాక్కుంటున్నాడు పేదవాళ్ళు దున్నుకుంటున్న భూములు పెద్దవాళ్ళకు కట్టబెడుతున్నారు.
బీజేపీ వస్తె..
• పెన్షన్ తియ్యం.. రెండు పెన్షన్‌లు ఇస్తాం.
• భర్తలు చనిపోయిన వారికి ఎప్పటికప్పుడు ఇస్తాం.
• రూపాయి ఖర్చు కాకుండా ఉచిత విద్య అందిస్తాం.
• దుఃఖం అనుభవించిన వాణ్ణి కాబట్టి ఆ బాధ నాకు తెలుసు.
• భర్త, కొడుకులని బ్రతికించుకోవడం కోసం పుస్తేల తాళ్ళు కాళ్ళమీద పెట్టే అవసరం లేకుండా ఉచిత వైద్యం అందిస్తాం.
• హరీష్ రావు వస్తే అడగండి వడ్డీలేని రుణాలు ఎందుకు ఇవ్వడం లేదు, అని నిలదీయండి. పైసలు లేకనా.. ప్రేమ లేకనా అని.
• మేం వస్తే బాకీలు వెంటనే విడుదల చేస్తాం.
• మహిళలు కట్టే ఇన్సూరెన్స్ మేమే కడతాం.
• ఒక్క కిలో అదనపు తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తాం.
రైతు, వైద్యం, విద్య, ఇల్లు ఇవన్నీ మా ప్రయారిటీలు. కెసిఆర్‌కి పదేళ్లు అవకాశం ఇచ్చాం.
ఇంకా ఇస్తే గోసపడతం. కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయండి. లకడారం మాజీ సర్పంచ్ గోవింద్ యాదగిరి పలువురు బీజేపీలో చేరారు.

