Home Page SliderTelangana

గజ్వేల్, హుజూరాబాద్ రెండు కళ్లు-ఈటల

దేశంలో ఒక వర్గాన్ని విస్మరించి ముందుకు పోలేమని RSS చీఫ్ మోహన్ భగవత్ స్పష్టంగా చెప్పారని… బీజేపీ సిద్ధాంతాలు డైనమిక్ ఉంటాయన్నారు. గల్ఫ్ దేశాలలో మిగతా దేశాలకు మించి ఇండియా సంబంధాలున్నాయన్నారు ఈటల. దేశంలోని మైనారిటీలకు కూడా విశ్వాసం కల్పించిన నాయకుడు మోదీ అన్నారు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అనేది బీజేపీ నినాదమన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కేబినెట్‌లో 27 మంది బీసీ మంత్రులు, 12 మంది ఎస్సీలు, 8 మంది ఎస్టీ, 5 మంది మైనారిటీ మంత్రులు ఉన్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. మాట ఇస్తే మాట తప్పని వ్యక్తి మోదీ అన్నారు. తెలంగాణలో 1947 నుండి ఇప్పటివరకు ఒక్క బీసీ సీఎం కాలేదని, ఇప్పుడు బీజేపీ అందుకు మేము సిద్ధమంటోందని, ఇప్పుడు ఓటరు ఆలోచించుకోవాలన్నారు. తనకు గజ్వేల్, హుజూరాబాద్ రెండు కళ్లన్నారు ఈటల. రెండు నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకోవడం కోసమే తాను పోటీలో నిలిచానన్నారు.

సంకుచిత మనస్తత్వం ఉన్న వారికి కాదు.. బ్రాడ్ గా ఆలోచించే వారికి నేను ఏంటో తెలుసునన్నారు ఈటల. ఉద్యమంలో నా కమిట్మెంట్ ఏందో ప్రజలందరికీ తెలుసునన్నారు. ఆర్థిక మంత్రిగా నా విజన్ తెలుసు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా అందరూ ఇంట్లో ఉంటే, పేషెంట్ దగ్గరికి వెళ్ళి ధైర్యం చెప్పిన బిడ్డనన్న విషయాన్ని మరువొద్దన్నారు. హుజూరాబాద్‌లో బీజేపీకి 1600 ఓట్లు ఉంటే, లక్షా 7 వేల ఓట్లు ఇచ్చి హుజూరాబాద్ ప్రజలు గెలిపించారన్నారు. ఈటలపై ప్రజలకు ఉన్న ప్రేమను ఎలా కొలుస్తారన్నారు. ఈటల నిప్పు కణం, ఉద్యమ కెరటమన్న విషయం హుజూరాబాద్‌లో గడపగడప చెబుతుందన్నారు. ఈటల వల్ల బీజేపీ పెరిగిందా, తగ్గిందా బెరీజు వేసుకోవాలన్నారు. తాను వేలుముద్ర మంత్రిని కానన్న ఈటల, తెలంగాణ ప్రజల కట్టే పన్నులు ఎంతో తెలుసు, ప్రజల అవసరం ఏంటో నాకు తెలుసు. ఎన్ని సమస్యలు ఉన్నాయో తెలుసు. ఏం చేస్తే బాగుపడతారో కూడా తెలిసిన వాడిననన్నారు.

ప్రస్తుతం తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందన్న ఈటల, లిక్కర్ మీద, భూములు అమ్ముకొని రోజు గడుపుతున్నారని ఎద్దేవా చేశారు. పేదలకు స్కీమ్‌లు ఇవ్వడానికి తాను వ్యతిరేకం కాదన్న ఈటల, అలవికాని హామీలు ఇవ్వొద్దన్నారు. కేసీఆర్ ప్రజలను తెలవకుండ కొడతున్నాడని.. రెండు నెలలకు ఒకసారి వచ్చే కరెంటు బిల్లు నెలకే వస్తోందన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ముసలి వాళ్లందరికీ పింఛన్ ఇస్తామన్నారు. ఇళ్లు లేనివారికి ఇళ్లు కట్టిస్తామని హామీ ఇస్తున్నామన్నారు. కిలో తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు. తెలంగాణలో కుటుంబ పెద్ద చనిపోతే 5 లక్షల రూపాయలు బీమా అందిస్తామన్నారు. విద్య, వైద్యం పూర్తిగా అందించే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు.