గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం ములుగు-శిలాసాగర్ ఎన్నికల ప్రచారంలో ఈటల
నేను ఈ ఊరు బిడ్డను. గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం ములుగు మండలం శిలాసాగర్ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఈటల రాజేందర్.
నేను ఈ ఊరు బిడ్డను. 17 సంవత్సరాలు ఇక్కడ కోళ్ల ఫాం నడిపిన. నేను ఎవరినీ విమర్శించడం లేదు. కానీ కెసిఆర్ ఫాం హౌస్ చుట్టూ నాలుగు లైన్ల రోడ్లు వేసుకున్నారు. మిగతా ఊళ్లకు గతుకుల రోడ్లే దిక్కు. వాగునుతి నుండి వస్తున్న ఈ రోడ్డు దుస్థితి చూసి బాధ వేస్తోంది. సీఎం నియోజకవర్గం ఇలా ఉంటుందా? బీజేపీ వస్తే బీసీ సీఎం కాబోతున్నారు. ఎస్సీ a b c d వర్గీకరణ జేస్తా అని మోదీ మాటిచ్చారు. ముప్పై ఏళ్ల బాధను అర్థం చేసుకున్నారు. మాట ఇస్తే తప్పని వ్యక్తి మోదీ.. మాట తప్పే వ్యక్తి కెసిఆర్

