‘గద్దర్ ఒక లెజెండ్’ ..భట్టి
‘పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా’.. అంటూ సమాజాన్ని తెలంగాణ రాష్ట్ర సాధనకు సమాయత్తం చేసి నడిపించిన ప్రజా యుద్ధనౌక గద్దర్’ అని డిప్యూటీ సీఎం అన్నారు. ‘గద్దర్ ఒక లెజెండ్’, ఒక శతాబ్ద కాలంలో ఆయన లాంటి వ్యక్తి పుడతారని నేను అనుకోవడం లేదని, ప్రపంచంలోని అన్ని సమస్యలపై ఆయన ప్రజలను పాటలతో కదిలించారని తెలిపారు. తెలంగాణ ఆట, పాటను ప్రపంచానికి పరిచయం చేసిన మహోన్నత వ్యక్తి గద్దర్ అని అన్నారు. తెలంగాణలో ఏ గ్రామంలో చూసిన గద్దర్ లాగే పాడాలని ప్రయత్నిస్తుంటారు, ఆయనను అనుకరిస్తుంటారు తెలంగాణ మొత్తానికి గద్దర్ ప్రతిరూపమని తెలిపారు.
తెలంగాణ సినీ పరిశ్రమను రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున గౌరవిస్తుంది. ఈ పరిశ్రమ ప్రపంచ స్థాయికి ఎదగాలి అని ఆకాంక్షించారు. గద్దర్ అవార్డుల కార్యక్రమం గొప్ప పండుగలా జరగాలి, ఏ తేదీన జరపాలనేది కమిటీ నిర్ణయం తీసుకోవాలని కోరారు. గద్దర్ ను అత్యంత ప్రీతిపాత్రమైన వ్యక్తిగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందని తెలిపారు. అడవి, సినిమా, మానవులు, రాజ్యాంగం అన్నిట్లో గద్దర్ తనదైన ముద్ర వేశారని అన్నారు.