ఉగాదికి గద్దర్ అవార్డులు
కళాకారులను, వాగ్గేయకారులను తమ ప్రభుత్వం ఎప్పుడూ గౌరవిస్తూనే ఉంటుందని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు . హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన భక్త రామదాసు జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. గానం అనేది అందరికీ వచ్చే భాగ్యం కాదన్న భట్టి విక్రమార్క.. మధుర గాయకులుగా ఉన్నందుకు గర్వపడాలని అన్నారు. ఉగాదికి గద్దర్ పేరిట ప్రభుత్వం సినీ కళాకారులకు ఇవ్వాలని సంకల్పించిదని ఆయన తెలిపారు. అనంతరం తెలంగాణ సంగీత నాటక అకాడమీ వారు మల్లు భట్టివిక్రమార్కతో సహా మంత్రులను సన్మానించారు.ఫిలిం అవార్డులతో పాటు సంగీత నాటక అకాడమీలో ఉన్నటువంటి వారందిరినీ ప్రోత్సహించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా నాటక పోటీలను పెట్టి వారికి కూడా అవార్డులను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని,. ఆ భగవంతుడు కళాకారులకు ప్రసాదించినటువంటి గొప్పకళను ప్రజలకు అందిస్తూ అంతా ప్రముఖంగా వెలుగొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అభిప్రాయపడ్డారు.