హైదరాబాద్ బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్ యాదవ్
తెలంగాణ: హైదరాబాద్ లోక్‌సభ అభ్యర్థిని బీఆర్ఎస్ పార్టీ ఖరారు చేసింది. గడ్డం శ్రీనివాస్ యాదవ్ పేరును ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ప్రకటించారు. హైదరాబాద్ నుండి ఎంఐఎం తరఫున అసదుద్దీన్ ఒవైసీ, బీజేపీ తరఫున మాధవీలత పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఇంకా ఖరారు కావలసి ఉంది.

