Home Page SliderTelangana

తెలంగాణా అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్

ఈ రోజు అసెంబ్లీ స్పీకర్‌గా వికారాబాద్ ఎమ్మెల్యే  గడ్డం ప్రసాద్‌ కుమార్‌ను ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ అధికారికంగా  ప్రకటించారు. కాగా తెలంగాణా అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే.అయితే మొత్తం 23 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్ పేరును ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నికైన గడ్డం ప్రసాద్ కుమార్‌ను సీఎం రేవంత్ రెడ్డి,డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టారు. దీంతో అసంబ్లీలోని ఎమ్మెల్యేలంతా స్పీకర్‌కు అభినందనలు తెలిపారు.అయితే పోటీ ఎక్కువ లేకపోవడంతో గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. ఈ నేపథ్యంలో స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు సహకరించిన ఎమ్మెల్యేలు అందరికీ సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.