Home Page SliderNational

బాక్సాఫీస్ రికార్డులు బద్ధలుకొడుతున్న గదర్ 2

సన్నీ డియోల్ గదర్ 2 బాక్సాఫీస్ వద్ద గర్జిస్తోంది. శుక్రవారం నాటికి ₹ 300 కోట్ల మార్కును అధిగమించిందని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ నివేదించారు. ఈ చిత్రం శుక్రవారం ఒక్కరోజే 20.50 కోట్ల రూపాయలను వసూలు చేసింది. తరణ్ ఆదర్శ్, సినిమా బాక్సాఫీస్ కలెక్షన్లను పంచుకుంటూ, “300 నాటౌట్… గదర్ 2 గర్జిస్తూనే ఉంది… మాస్ పాకెట్స్ పూర్తిగా భిన్నమైన లీగ్‌లో ఉన్నాయి” అంటూ ట్విట్టర్లో రాసుకొచ్చారు. తరణ్ ఆదర్శ్ తన పోస్ట్‌లో ఈ చిత్రం అద్భుతమైన బాక్సాఫీస్ విజయానికి పెద్ద భాగం టైర్ 2, 3 నగరాల్లోని కలెక్షన్లే కారణమని పేర్కొన్నాడు. తరణ్ ఆదర్శ్ తన ట్వీట్‌లో ఇలా జోడించారు, “అలాగే, టైర్ 2, టైర్ 3 ఏరియాల కలెక్షన్లు కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేస్తున్నాయన్నారు. అనిల్ శర్మ దర్శకత్వం వహించిన గదర్ 2 2001లో హిట్ అయిన గదర్ చిత్రానికి సీక్వెల్. సీక్వెల్‌లో సన్నీ డియోల్, అమీషా పటేల్, ఉత్కర్ష్ శర్మ వరుసగా తారా సింగ్, సకీనా, జీతే ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమా గత వారం థియేటర్లలో విడుదలైంది. ఇది బాక్సాఫీస్ వద్ద అక్షయ్ కుమార్ OMG 2 తో పోటీపడుతోంది.