మిల్క్ కేక్ లో ఫంగస్
జగిత్యాల జిల్లా కేంద్రంలోని కరీంనగర్ డెయిరీ మిల్క్ పార్లర్ లో ఫుడ్ ఇన్స్పెక్టర్ అనూష తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా మిల్క్ కేక్ లో ఫంగస్ వచ్చినట్లు గుర్తించారు. దీంతో కరీంనగర్ డెయిరీ నిర్వాహకులకు నోటీసులు ఇచ్చారు. ఎక్స్ పెయిరీ అయిన కేక్ లకు కవర్స్ మార్చి పంపిణీ చేయడంతోనే ఫంగస్ వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఎవరైనా మిల్క్ కేక్ లు కొనుగోలు చేస్తే రిటర్న్ చేయాలని సూచించారు.