Home Page SliderTelangana

ఆస్తి కోసం అంత్యక్రియలు ఆపేశారు..

సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఆస్తి కోసం వృద్ధురాలి అంత్యక్రియలు నిలిపివేశారు. గ్రామానికి చెందిన వంగ కిష్టవ్వ (90) నిన్న మధ్యాహ్నం మరణించింది. కిష్టవ్వకు ముగ్గురు కొడుకులు, కూతురు ఉన్నారు. అయితే.. ముగ్గురిలో ఇద్దరు కుమారులు మరణించారు. రెండో కుమారుడు రాజేశం తల్లి ఆరోగ్యంగా ఉన్న సమయంలో తల్లి పేరున ఉన్న సుమారుగా రూ.30 లక్షల విలువ గల ఇంటిని తన పేరున రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఈ క్రమంలో తల్లి మరణించడంతో పెద్దకుమారుడు, చిన్న కుమారుల కుటుంబ సభ్యులు రాజేశం పేరు మీద ఉన్న ఇంటిని మూడు భాగాలుగా రిజిస్ట్రేషన్ చేస్తేనే అంత్య క్రియలు చేయాలని పట్టుబట్టి కూర్చున్నారు. దీంతో గ్రామంలోని కుల సంఘం సభ్యులు ఇరు వర్గాలకు నచ్చజెప్పి నోటరీ ద్వారా మూడు భాగాలకు ఏర్పాటు చేశారు. చనిపోయిన వృద్ధురాలి పట్ల ఇంత పాషవికంగా ప్రవర్తిస్తున్న కుటుంబ సభ్యుల తీరుపై గ్రామస్తులు మండిపడ్డారు.