సరదా.. సరదాగా 2వ సాంగ్ విడుదల
వెంకటేష్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం సైంధవ్. శైలేష్ కొలను దర్శకుడు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేశారు. సోమవారం వీవీఐటీ కాలేజీ విద్యార్థుల సమక్షంలో సరదా సరదాగా అనే రెండో గీతాన్ని విడుదల చేశారు. సంతోష్ నారాయణన్ స్వరపరచిన ఈ గీతానికి రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించారు. అనురాగ్ కులకర్ణి పాడారు. మనసుకు హత్తుకునే మెలోడీగా ఈ పాట సాగింది. తల్లిదండ్రులకు తమ కుతూరిపై ఉండే అనుబంధాన్ని తెలియజెప్తూ ఈ పాట హృద్యంగా సాగింది. బాధ్యత, ప్రేమాభిమానాలు కలిగిన తండ్రిగా వెంకటేష్ పాత్రను చూపించిన విధానం చాలా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ- ఎస్.మణికందన్, సంగీతం- సంతోష్ నారాయణ్, రచన- దర్శకత్వం- శైలేష్ కొలను.