పెట్టుబడిదారులకు పూర్తి భరోసా: సీఎం చంద్రబాబు
విశాఖపట్నం: రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే సంస్థలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.
విశాఖలో నిర్వహించిన ఇండియా–యూరప్ బిజినెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ, “స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో ముందుకు సాగుతున్నాం. కంపెనీల అనుమతుల్లో ఎలాంటి జాప్యం ఉండదు. పారదర్శకంగా, వేగవంతంగా నిర్ణయాలు తీసుకుంటాం” అని హామీ ఇచ్చారు.
తదుపరి దశలో అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ సెంటర్, అలాగే విశాఖలో గూగుల్ డేటా సెంటర్ త్వరలో ప్రారంభమవనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధికి సాంకేతిక రంగం కీలక పాత్ర పోషిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

