బీజేపీ, కాంగ్రెస్ లేకుండా ఫ్రంట్- అఖిలేష్, మమత అంగీకారం
కాంగ్రెస్, బీజేపీకి సమాన దూరం
వచ్చే ఎన్నికల్లో కూటమిగట్టాలని నిర్ణయం
కోల్‌కతాలో మమతతో భేటీ అయిన అఖిలేష్
ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో మమత భేటీ
దేశంలోని మూడు ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, బీజేపీ రెండింటికీ ఆమడదూరంలో ఉండాలన్న భావనకు వచ్చాయి. రెండు పార్టీలకు సమాన దూరంలో ఉండాలన్న కార్యాచరణకు బెంగాల్ రాజధాని కోల్‌కతాలో మొదటి అడుగు పడింది. ఇవాళ కోల్‌కతాలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీతో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ భేటీలో ఆసక్తికర ఘట్టం ఆవిష్కృతమయ్యింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి బెనర్జీ వచ్చే వారం బిజూ జనతాదళ్‌కు నాయకత్వం వహిస్తున్న ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ను కలవనున్నారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని ప్రతిపక్ష పార్టీల సమూహానికి కీలక నేతగా చూపించే బీజేపీ ప్రయత్నాన్ని అడ్డుకోవడమే ఈ వ్యూహం లక్ష్యమన్న అభిప్రాయాన్ని ఇద్దరు నేతలు వ్యక్తం చేశారు. ఇటీవల లండన్‌లో ప్రసంగిస్తూ భారత పార్లమెంట్‌లో ప్రతిపక్ష నేతల మైక్‌లు మ్యూట్ చేశారని ఆరోపించిన గాంధీ క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. గాంధీని ఉపయోగించి బీజేపీ తమను లక్ష్యంగా చేసుకుంటోందని ప్రతిపక్షాలు అనుమానిస్తున్నాయి.
రాహుల్ గాంధీ విదేశాల్లో వ్యాఖ్యలు చేశారు, ఆయన క్షమాపణ చెప్పే వరకు బీజేపీ పార్లమెంట్‌ను నడపనివ్వదు. దీని అర్థం కాంగ్రెస్‌ను ఉపయోగించుకుని పార్లమెంటును నడపాలని బీజేపీ కోరుకోవడం లేదని తృణముల్ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. రాహుల్ గాంధీ, ప్రతిపక్షానికి ఫేస్‌గా ఉండాలని బీజేపీ కోరుకుంటోంది. బీజేపీ.. 2024 ఎన్నికల కోసం ప్రధాని ముఖాన్ని నిర్ణయించాల్సిన అవసరం లేదని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ చెప్పారు. విపక్షాలకు కాంగ్రెస్ పెద్ద బాస్ అని అనుకోవడం అపోహ అని బంద్యోపాధ్యాయ అన్నారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మార్చి 23న నవీన్ పట్నాయక్‌ను కలుస్తారని… బీజేపీ, కాంగ్రెస్‌లకు సమాన దూరం కొనసాగించే ప్రణాళికలు చర్చిస్తారన్నారు బందోపాధ్యాయ. ఇది మూడో ఫ్రంట్ అని చెప్పడం లేదని… ప్రాంతీయ పార్టీలకు వేదకవుతుందని మాత్రం చెప్పారు.

కాంగ్రెస్, బీజేపీ రెండింటికీ సమాన దూరాన్ని కొనసాగించాలనుకుంటున్నట్లు అఖిలేష్ యాదవ్ ధృవీకరించారని తృణముల్ వర్గాలు చెప్పాయి. బెంగాల్‌లో, మేము మమతా దీదీతో ఉన్నామని… ప్రస్తుతం, మా స్టాండ్ బీజేపీ, కాంగ్రెస్ రెండింటికీ సమాన దూరాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నట్టు అఖిలేష్ కోల్‌కతాలో విలేకరులతో అన్నారు. బీజేపీ వ్యాక్సిన్ పొందే వారికి సిబిఐ, ఈడీ, ఐటీ ఇబ్బంది లేదని ఆయన అన్నారు. బీజేపీలో చేరిన తర్వాత కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా కేసులు ఎత్తేస్తున్నారంటూ విమర్శించారు.
ప్రతిపక్ష పార్టీ నాయకులను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈడీ వేటాడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారని, ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మనీష్ సిసోడియా, రాష్ట్రీయ జనతాదళ్‌కు చెందిన లాలూ యాదవ్, కుటుంబ సభ్యులను కూడా వేధిస్తున్నారని చెప్పుకొచ్చారు.