నేటి నుంచి సొంత వ్యాపారస్తులకు పట్టిందల్లా బంగారం
సెప్టెంబర్ 19
మేషం
వాస్తవానికి మీరు నిదానస్తులైనప్పటికీ కొంత ఉద్రేకానికి లోనవుతారు. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. నిరుద్యోగుల ఊహలు నిజమవుతాయి. మిత్రులనుంచి శుభవర్తమానాలు అందుతాయి. విద్యార్థుల కష్టం ఫలిస్తుంది. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి పెరుగుతుంది.
వృషభం : రవాణా రంగాలవారికి సంతృప్తి, పురోభివృద్ధి. బ్యాంకు వ్యవహారాలలో పరిచయంలేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. అవసరానికి సన్నిహితులు సాయం పొందుతారు. స్థిరస్తి విషయాలలో చికాకులు తొలగుతాయి. ఉద్యోగులకు దీర్ఘ కాలిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.
మిథునం : నూతన పరిచయాలేర్పడతాయి. ఇరుగు పొరుగు వారి వైఖరి వల్ల ఒకింత ఇబ్బందులు తప్పవు.చేపట్టిన పనిలో దృఢసంకల్పం ఉంటే విజయం తథ్యం. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహారిస్తారు ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది. వాహన వ్యాపారస్తులకు విశేషమైన లాభాలు అందుతాయి
కర్కాటకం : ఆదాయ వ్యయాలు మీ బడ్జెట్‌కు విరుద్ధంగా ఉంటాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి ఉద్యోగులకు అదనపు బాధ్యతలు పెరుగుతాయి.స్త్రీలకు పనివారలతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణాలు మంచికాదు.పత్రికా, మీడియా రంగాల వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. వైజ్ఞానిక శాస్త్ర విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.ఆరోగ్య పరంగా వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి వ్యాపారులకు గందరగోళ పరిస్థితులుంటాయి.
సింహం : నూతన వ్యాపారాలు ప్రారంభించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు పని ఒత్తిడి ఉన్నపటికీ నిదానంగా పూర్తిచేస్తారు.స్త్రీలు నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొంటారు. పెద్దల సలహాను పాటించి
మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. ఉద్యోగ యత్నాలలో విజయం సాధిస్తారు. సంఘంలో పరిచయాలు పెరుగుతాయి.వృత్తి వ్యాపారాలు అనుకున్నది సాధిస్తారు.
కన్య : బంధుమిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏ విషయంలోనూ ఒంటెత్తు పోకడ మంచిది కాదు. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. ఆశలొదిలేసుకున్న మొండి బాకీలు వసూలు అవుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో అప్రమత్తంగా వ్యవహరించాలి.
తుల : విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారలకు ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. పోస్టల్, కొరియర్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం తప్పవు. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. చేపట్టిన పనుల్లో యత్నకార్యసిద్ధి కలుగుతుంది.ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం యోగం ఉన్నది.
వృశ్చికం : ఉద్యోగస్తులకు అధికారులతో ఏకీభావం కుదరదు. ధనం విరివిగా వ్యయమైనా సార్థకత, ప్రయోజనం ఉంటాయి. దైవ సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. బంధు మిత్రులతో మీ మాటతో విబేదిస్తారు. ఉద్యోగం వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఆర్థిక వాతావరణం చికాకుగా ఉంటుంది. స్త్రీలు అనవసర విషయాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం.
ధనుస్సు : వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగులకు సహోద్యోగులతో మాటపట్టింపులు కలుగుతాయి.మీకు దగ్గరగా ఉన్న, మీకే తెలియని ఒక అవకాశం మిమ్మల్ని వరిస్తుంది. సోదరులతో స్థిరస్తి వివాదాలు కలుగుతాయి అవరానికి చేతిలో డబ్బు నిలువ ఉండదు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. స్త్రీలు నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొంటారు.
మకరం : వ్యాపారమును ఆశించిన లాభాలు అందుకుంటారు. విద్యార్థులకు విదేశీ ప్రయాణ ప్రయత్నాలలో కీలక సమాచారం అందుతుంది. మీ శ్రీమతి ప్రోద్బలంతో కొత్త యత్నాలు మొదలెడతారు. ముఖ్యులకు విలువైన కానుకలు ఇచ్చి ఆదరణ పొందుతారు. చిన్ననాటి మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు.
కుంభం : బంధువులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. అనారోగ్య విషయంలో స్వల్ప ఇబ్బందులుంటాయి. వ్యాపారులకు నిరుత్సాహవాతావరణం ఉంటుంది. చిన్నతరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులకు కలిసిరాగలదు. ప్రయాణాల్లో ఆకస్మిక మారులుంటాయి. ఉపాధ్యాయులకు గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ధన వ్యయం, విరాళాలిచ్చే విషయంలో మెలకువ వహించండి.
మీనం. : చేపట్టిన పనులు ముందుకు సాగవు. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. తెలివితేటలకు మంచి గుర్తింపు లభిస్తుంది. గృహ వాతావరణం చికాకుగా ఉంటుంది. ఉదర అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారులకు నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఉద్యోగమున తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు.
ఎం. శ్రీకాంత్ శర్మ
హిందూ ధర్మ చక్రం
98494 85645