రెండు రకాల బస్సుల్లోనే మహిళలకు ఉచిత పథకం
తెలంగాణ ఆర్‌టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని రేపు మధ్యాహ్నం రెండు గంటల నుండి అమలు లోకి వస్తుందని ప్రభుత్వం జీవో జారీ చేసింది. అయితే పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులలోనే అమలు అవుతుందని తెలియజేశారు. మెట్రో, డీలక్స్, గరుడ, సూపర్ లగ్జరీ బస్సులకు ఇలాంటి అవకాశం ఇప్పుడు లేదు. ఇక హైదరాబాద్ నగరంలో సిటీ బస్సులలో ఉచిత ప్రయాణం ఉంటుందా, లేదా అనేది తెలియాల్సి ఉంది. మొదటి వారం రోజులు ఐడీ కార్డులు లేకుండానే ప్రయాణం చేయవచ్చని తెలిపారు. త్వరలోనే మహాలక్ష్మి పథకం పేరుతో ఐడీ కార్డులు ఇస్తారని తెలియజేశారు.

