ఏపీలో త్వరలో అమలుకానున్న ఉచిత ఇసుక విధానం
ఏపీలో ఉచిత ఇసుక విధానానికి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా ఈ నెల 8 నుంచి ఏపీలో ఉచిత ఇసుక విధానం అమలులోకి తేవాలని సీఎం చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు ఉచిత ఇసుక విధానంపై తగిన చర్యలు చేపట్టాలని సీఎం ఇప్పటికే మంత్రి కొల్లు రవీంద్రకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇసుక లోడింగ్,రవాణా ఛార్జీలు నిర్ణయించేందుకు కలెక్టర్ల అధ్యక్షతన త్వరలోనే కమిటీని ఏర్పాటు చేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు.