వారికి ఫ్రీ నైట్ రైడ్స్..
నూతన సంవత్సర వేడుకలలో మద్యం సేవించే మందుబాబులకు టీజీ ఫోర్ వీలర్స్ అసోసియేషన్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. వారికి ఈ రాత్రి 10 గంటల నుండి అర్థరాత్రి ఒంటిగంట వరకూ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ప్రకటించారు. 91776 24678 నెంబర్‌కు ఫోన్ చేస్తే ఈ ఉచిత క్యాబ్ సర్వీస్ అందుకోవచ్చని పేర్కొన్నారు. ఈ ఆఫర్ కోసం 500 కార్లు, 250 బైక్ ట్యాక్సీలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదాలను నివారించేందుకు ఈ బాధ్యత తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.