వయోవృద్ధులకు ఉచిత కంటి పరీక్షలు
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘం భవనంలో గురువారం వయో వృద్ధులకు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వరంగల్‌కు చెందిన కంటి వైద్య నిపుణులు కంటి సమస్యలు ఉన్నవారికి కంటి అద్దాలతోపాటు ఉచితంగా మందులను అందజేశారు. అవసరమైన వారికి శస్త్రచికిత్స కోసం వరంగల్ ఆసుపత్రికి రిఫర్ చేశారు. విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.

