రూ.36,397 కోట్ల ఖర్చుతో కరోనా వ్యాక్సిన్ల ఉచిత పంపిణీ
కేంద్రప్రభుత్వం కొవిడ్ మహమ్మారి సమయంలో రూ.36,397 కోట్ల ఖర్చుతో కరోనా వ్యాక్సిన్లను ఉచిత పంపిణీ చేసిందని కేంద్రప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర ఆరోగ్యశాఖ సహాయమంత్రి ప్రతాప్ రావ్ జాదవ్ ఈ విషయాన్ని లోక్‌సభలో పేర్కొన్నారు. నేషనల్ కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రోగ్రాం కింద అన్ని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఉచితంగా కొవిడ్ వ్యాక్సిన్‌ను పంపిణీ చేశామన్నారు. జూలై 29, 2024 వరకూ దేశవ్యాప్తంగా 20.68 కోట్ల డోసుల వ్యాక్సీన్లను పంపిణీ చేసినట్లు తెలిపారు.