Home Page SliderTelangana

ఈ పాపకు జీవితకాలం ఉచిత బస్సు ప్రయాణం

ఇటీవల కరీంనగర్ బస్ స్టేషన్‌లో జన్మించిన ఒక చిన్నారికి తెలంగాణ ఆర్టీసీ గొప్ప గిఫ్ట్ అందించింది. ఈ బిడ్డకు జీవితకాలం ఉచిత బస్ పాస్‌ను TGSRTC ప్రకటించింది. ఈ పాప డెలివరీకి సహకరించిన సిబ్బందిని ఆర్టీసీ యాజమాన్యం సత్కరించింది. ఇటీవల బస్సు వద్దకే అంబులెన్స్ తీసుకువచ్చి సేవలు అందించి తల్లి బిడ్డను కాపాడిన సంగతి తెలిసిందే. ఈ విషయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆర్టీసీ సిబ్బందిని, వైద్యులను అభినందించారు. బస్సులు, బస్ స్టేషన్లలో జన్మించిన పిల్లలకు ఉచితంగా జీవితకాలం ఉచిత బస్ పాస్‌లను మంజూరు చేయాలని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం విధానాన్ని చేసింది. దీనికి అనుగుణంగా ఇప్పుడు ఈ చర్యలు తీసుకున్నారు.