ఏపీలో మహిళలకు ఫ్రీ బస్సు
ఏపీ మంత్రి జనార్థన రెడ్డి మహిళలకు ఫ్రీ బస్సుపై కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలలో భాగంగా ఉన్న మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ఈ సంక్రాంతి లోపే అమలు చేస్తామని పేర్కొన్నారు. అభివృద్ధి చేస్తూనే, సంక్షేమానికి కూడా తమ ప్రభుత్వం పెద్ద పీట వేసిందని తెలిపారు. ఫించన్ల పంపిణీ, ఉచిత గ్యాస్ సిలెండర్ పథకాలను మొదలు పెట్టామనిచెప్పారు. సంక్రాంతి లోపు మహిళలకు ఉచిత బస్సుతో పాటు అనేక పరిశ్రమలు కూడా తీసుకువస్తున్నారని, యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభిస్తాయని పేర్కొన్నారు.

