NewsTelangana

రోడ్డు ప్రమాదంలో నలుగురికి తీవ్రగాయాలు

ఖమ్మం జిల్లా పండితాపురంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం డోర్నకల్‌ మండలం గొల్లచెర్ల గ్రామానికి చెందిన చాంపల, శ్రీరామ్‌ గొర్రెలను తీసుకొని పండితాపురం సంతకు ఆటోలో వెళ్తున్నారు. అదే సమయంలో ఖమ్మం పట్టణానికి చెందిన అశోక్‌, అజయ్‌ ద్విచక్ర వాహనంపై ఖమ్మం నుంచి డోర్నకల్‌కు వెళ్తున్నారు. పండితాపురం సమీపంలో ఎదురెదురుగా వచ్చిన ఈ రెండు వాహనాలు అదుపు తప్పి ఢీ కొట్టాయి. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న అశోక్‌, అజయ్‌.. ఆటోలో ప్రయాణిస్తున్న చాంపల, శ్రీరామ్‌ తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు క్షతగాత్రులను 108 వాహనంలో ఖమ్మం ఆస్పత్రికి తరలించారు.