Home Page SliderTelangana

షవర్మా తిని నలుగురికి అస్వస్థత..

షవర్మా తిని నలుగురు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో ఆస్పత్రి పాలయ్యారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన సికింద్రాబాద్ లోతుకుంటలో చోటు చేసుకుంది. పలువురు అస్వస్థతకు గురి కావడంతో యాజమాన్యం హోటల్ మూసి వేసింది. అయితే.. మూడు రోజుల క్రితమే మళ్లీ తెరిచి షవర్మా విక్రయాలను ప్రారంభించారు. అక్కడ తిని పలువురు ఆస్పత్రి పాలయ్యారన్న విషయం తెలిసి కూడా.. మళ్లీ జనం తినేందుకు ఎగబడ్డారు. ఇప్పుటికైనా. ఆ హోటల్ పై చర్యలు తీసుకోవాలని, మళ్లీ తెరిచే అవకాశం లేకుండా సీజ్ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.