నలుగురు ఎంపీలు అవే స్థానాల్లో పోటీ చేస్తారు: అమిత్ షా
తెలంగాణ: లోక్‌సభ ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాల్లో మార్పులు ఉండవని కేంద్ర మంత్రి అమిత్ షా ఆ పార్టీ నేతలకు స్పష్టం చేశారు. నలుగురు ఎంపీలు అవే స్థానాల్లో పోటీ చేస్తారని చెప్పారు. సికింద్రాబాద్ నుండి కిషన్‌రెడ్డి, కరీంనగర్ నుండి బండి సంజయ్, ఆదిలాబాద్ నుండి సోయం బాపూరావు, నిజామాబాద్ నుండి ధర్మపురి అర్వింద్ మరోసారి పోటీ చేస్తారన్నారు.