జమ్ము కాశ్మీర్‌లో అంతులేని విషాదఘటన- చెట్టుకూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం
జమ్ము కాశ్మీర్‌లో దారుణం జరిగింది. అడవిలో చెట్టుకింద టెంట్ వేసుకుని కూర్చుని ఉన్న నలుగురు ఒకే సారిగా మరణించారు. ఈదురు గాలులు, వర్షం కారణంగా చెట్టు కూలడంతో అడవిలో టెంట్ వేసుకుని కూర్చుని ఉన్న నజీర్ అహ్మద్, అన్వర్ బేగం, షమా బేగం, షకీల్ బనో అనే వ్యక్తులు మరణించారు. వీరందరూ కత్వా జిల్లాకు చెందినవారుగా గుర్తించారు. వీరి టెంట్‌పై నేరుగా చెట్టు కూలి పడింది. ఈ సంఘటన కిష్త్వార్ జిల్లాలోని బహన్లా అడవుల్లో జరిగింది.