Home Page SliderNational

నాలుగు కాళ్ల చిన్నారి జననం, ఆశ్చర్యంలో వైద్యులు

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఓ అరుదైన వైద్యపరమైన ఘటనలో ఓ పాప నాలుగు కాళ్లతో జన్మించింది. బుధవారం నగరంలోని కమల రాజా ఆసుపత్రిలోని స్త్రీ, శిశు పిల్లల వైద్య విభాగంలో ఆర్తి కుష్వాహకు పాప జన్మించింది. ప్రసవం తర్వాత, ఆసుపత్రి సూపరింటెండెంట్‌తో పాటు వైద్యుల బృందం శిశువును పరీక్షించి, నవజాత శిశువు ఆరోగ్యంగా ఉన్నట్లు ప్రకటించారు. పుట్టుకలో శిశువుకు నాలుగు కాళ్లు ఉన్నాయని, శారీరక వైకల్యం ఉందని. కొన్ని పిండాలు అదనంగా ఉన్నాయని…వైద్య శాస్త్ర భాషలో ఇస్కియోపాగస్ అంటారని వైద్యులు వెల్లడించారు. ఆసుపత్రిలోని చిన్నపిల్లల విభాగం శిశువుకు పరీక్షలు నిర్వహిస్తోంది. పరీక్షలు క్లీన్‌గా వచ్చినట్లయితే, వైద్యులు అదనపు కాళ్ళను తొలగించడానికి శిశువుకు శస్త్రచికిత్స చేస్తారు. ప్రస్తుతం పీడియాట్రిక్ డిపార్ట్‌మెంట్ వైద్యులు శరీరంలో ఏదైనా ఇతర వైకల్యం ఉందా లేదా అని తనిఖీ చేస్తున్నారు. పరీక్షల తర్వాత, ఆమె ఆరోగ్యంగా ఉంటే, శస్త్రచికిత్స ద్వారా ఆ కాళ్లను తొలగిస్తారు. తద్వారా ఆమె సాధారణ జీవితం గడపవచ్చని వైద్యులు తెలిపారు. ఈ ఏడాది మార్చిలో మధ్యప్రదేశ్‌లోని రత్లామ్ నగరంలో ఓ మహిళ రెండు తలలు, మూడు చేతులు, రెండు కాళ్లతో బిడ్డకు జన్మనిచ్చింది.