Breaking NewsHome Page SliderNewsTelangana

ఒకేరోజు నలుగురు రైతులు ఆత్మహత్య

బోరు బావుల్లో నీళ్లు పడక అప్పులు భారమై ముగ్గురు, రుణమాఫీ కాక మనస్తాపంతో ఒకరు ఆత్మహత్యకు పాల్ప‌డిన ఘ‌ట‌న‌లు తెలంగాణ‌లో జ‌రిగాయి. గద్వాల్ జిల్లా మానవపాడు మండల కేంద్రానికి చెందిన బొంకురు శేఖర్ రెడ్డి (32) పంట పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.సంగెం మండలం పోచమ్మతండా పంచాయతీ పరిధిలోని మహారాజ్ తండాకు చెందిన బానోత్ తిరుపతి (39) పురుగుల మందు తాగు ఆత్మహత్య చేసుకున్నాడు.వికారాబాద్ జిల్లా దోమ మండలం అయినాపూర్‌కు చెందిన బ్యాగరి యాదయ్య(35)కు చింత చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో లింగన్న పేరిట రూ.80 వేలు, అతడి భార్య పేరిట రూ.1.50 లక్షల పంట రుణం ఉన్నది. రూ.2.30 లక్షల రుణం మాఫీ అయ్యే అవకాశం లేదని, వడ్డీతో సహా చెల్లించాలని బ్యాంకు అధికారులు తేల్చిచెప్పడంతో తీవ్ర ఆవేదనకు లోనయ్యారు.. ఇప్పటికే వ్యవసాయ భూమి కొనుగోలు, పంట పెట్టుబడి కోసం దాదాపు రూ.15 లక్షల దాకా అప్పు చేసిన లింగన్న, రూ.2లక్షల రుణమాఫీ కూడా కాకపోవడంతో మనోవేద‌నతో ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు.దీంతో తెలంగాణాలో ఆత్మ‌హ‌త్యల క‌ల‌క‌లం రేగింది.