కారులో ఊపిరి ఆడక నలుగురు చిన్నారుల మృతి
ఏపీలోని విజయనగరంలో విషాదం నెలకొంది. విజయనగరం కంటోన్మెంట్ పరిధిలోని ద్వారపూడి గ్రామంలో కారు లాక్ పడటంతో అందులో చిక్కుకున్న నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మృతులను ఉదయ్ (8), చారుమతి (8), చరిష్మా (6), మనస్విగా గుర్తించారు. కారు అద్దాలు పగలగొట్టి చిన్నారుల మృతదేహాలను బయటికి తీశారు. చిన్నారులు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నారు. తల్లిదండ్రులతో పాటు బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

